కార్తీక దీపం శౌర్య చించేసింది.. అమ్మ బాబోయ్.. వీడియో వైరల్!!

Karthika Deepam Fame Shourya Baby Krithika Dance For Color Photo Song

కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు వారెవ్వరూ ఉండరు. కార్తీక దీపం సీరియల్‌లోని ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అయి ఉంటారు. ముఖ్యంగా దీప-వంటలక్క పాత్రలకు తెలుగు మహిళా లోకం నీరాజనాలు పడుతోంది. డాక్టర్ బాబు కార్తీక్ కనపడకుంటే ఆ రోజు సీరియల్ చూడటమే దండగా అనుకునే వారున్నారు. ఆ పాత్రలతో పాటు హిమ, శౌర్యల క్యారెక్టర్స్ ఓ రేంజ్‌లొ పాపులర్ అయ్యాయి. శౌర్య పాత్రలో కృతిక నటన, హిమ క్యారెక్టర్‌లో సహృద నటన అందర్నీ కట్టిపడేస్తుంటుంది.

Karthika Deepam Fame Shourya Baby Krithika Dance For Color Photo Song
Karthika Deepam Fame Shourya Baby Krithika Dance For Color Photo Song

అయితే ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు రియల్ లైఫ్‌లో ఒకలా.. రీల్ లైఫ్‌లో మరోలా ఉంటారు. శౌర్య పాత్రలో కృతిక గంభీరంగా, రౌడీగా ఉంటుంది.. కానీ నిజ జీవితంలో ఎంతో కామ్‌గా, సైలెంట్‌గా ఉంటుది. ఇక హిమ పాత్రలో సహృద ఎంతో సైలెంట్‌గా ఉంటే నిజ జీవితంలో తెగ అల్లరి చేస్తుంది. కృతిక అందరికీ సాయం చేస్తూ.. మంచి పనులతో అందరి మనసులను దోచుకుంటూ ఉంటుది. సహృద తన డ్యాన్సులతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను పెంచుకుంటోంది.

అయితే సహృద దారిలోనే శౌర్య కూడా వచ్చేసింది. సహృద వేసే స్టెప్పులు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంటాయి. తాజాగా కృతిక కూడా డ్యాన్సులు చేయడం మొదలెట్టేసింది. ఇంతకు ముందు ఓ పాటకు డ్యాన్స్ చేయగా.. తాజాగా కలర్ ఫోటో సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంత మంచి పాటను సినిమాను అందించినందుకు థ్యాంక్స్ అంటూ కలర్ ఫోటో టీంకు కృతిక థాంక్స్ చెప్పింది. మొత్తానికి కృతిక చేసిన ఈ డ్యాన్స్ బాగానే క్లిక్ అయింది.