ఓటిటి : కార్తీ “సర్దార్” డిజిటల్ రిలీజ్ ఎప్పుడు ఎందులో అంటే.?

ఈ 2022 సంవత్సరంలో మన తెలుగులో వచ్చినన్ని హిట్ సినిమాలు అలాగే డిజాస్టర్ లు ఎప్పుడూ రాలేదని చెప్పాలి. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా మన దగ్గర కూడా మంచి హిట్ కాగా ఈ చిత్రాల్లో తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో స్టార్ హీరో కార్తీ నటించిన థ్రిల్లర్ చిత్రం ‘సర్దార్” కూడా ఒకటి.

మరి సర్దార్ లో కార్తీ అయితే డ్యూయల్ రోల్ చెయ్యగా ఈ చిత్రం కార్తీ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో నెక్స్ట్ రెండో సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే ఓటిటి లో డిజిటల్ రిలీజ్ ఎప్పుడు ఎందులో అవుతుంది అనేది తెలుస్తుంది.

మరి ఈ సినిమాని ఆహా సంస్థ దక్కించుకోగా ఇందులో అయితే తెలుగు మరియు తమిళ్ లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ డేట్ అయితే నవంబర్ 24 కి లాక్ అయ్యినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉండగా దీనిని మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.