టీజర్ టాక్ : “జపాన్” గా మరో డిఫరెంట్ అటెంప్ట్ తో అదరగొట్టిన కార్తీ

తమిళ సినిమాలో ఉన్న హీరోస్ లో మన తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న వారిలో ప్రముఖ హీరో కార్తీ కూడా ఒకడు. మరి కార్తీ హీరోగా నటించిన గత చిత్రం సర్దార్ అలాగే దీనితో పాటుగా తాను మరో హీరోగా నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించగా వీటి తర్వాత కార్తీ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమానే “జపాన్”.

కొత్త దర్శకుడు రాజు మురుగన్ తో చేస్తున్న ఈ సినిమా పట్ల మొదటి నుంచి కూడా మంచి బజ్ ఉంది. మెయిన్ గా ఇందులో కార్తీ మొత్తం గెటప్ లుక్ నే మార్చేశారు. దీనితో కార్తీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది అని ఫిక్స్ అయ్యింది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్ రాగా ఈ టీజర్ తో సినిమాపై మరిన్ని మంచి అంచనాలు నెలకొన్నాయి అని చెప్పొచ్చు.

కాగా ఈ టీజర్ లో జపాన్ అనే ఒక పేరు మోసిన దొంగగా కార్తీ కనిపిస్తున్నాడు. డబ్బులు అమ్మాయిలు బంగారం అంటే ఎంతో మోజు ఉన్న క్రిమినల్ పాత్రలో తాను కనిపిస్తున్నాడు. ఎన్నో వందల రాబరీలు చేసినా కూడా దొరకకుండా పోలీసులని ముప్పు తిప్పలు పెట్టించే రౌడీగా తాను కనిపిస్తున్నాడు.

దీనితో ఈ టీజర్ మాత్రం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో సునీల్ కూడా మంచి పాత్రలో కనిపిస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. మొత్తంగా మాత్రం ఈ టీజర్ తో కార్తీ అదరగొట్టేలానే ఉన్నాడని చెప్పాలి. కాగా ఈ చిత్రం అయితే తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.
Japan - Official Teaser (Telugu) | Karthi, Anu Emmanuel, Sunil| GV Prakash | Raju Murugan | SR Prabu