కర్ణాటక ప్రభుత్వం పై కాంతార ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం…?

ఇటీవల కన్నడ భాషలో తెరకెక్కిన కాంతార సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదలై కన్నడ భాషలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో కూడా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా ఇక్కడి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఎఫెక్ట్ కర్ణాటక ప్రభుత్వంపై పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

కర్ణాటకలోని ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను మరియు భూతకోల నృత్యకారుల గురించి రిషబ్ శెట్టి అద్భుతంగా ఈ సినిమాలో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు పైబడిన భూతకోల నృత్యకారులకు ప్రభుత్వం ప్రతినెల 2000 రూపాయల ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు బెంగళూరు ఎంపీ పీసీ మోహన్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. హిందూ ధర్మంలో పురాతన కాలం నుండి భూతకోల అనేది ప్రత్యేక దైవరాధనగా గుర్తింపు పొందింది. అందువల్ల భూతకోల కళాకారులను ఆదుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.

 

 

భూతకోల నృత్యాలు చేస్తూ దైవారాధన చేస్తున్న వారికి భాజపా నేతృత్వంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం ప్రతినెల 2000 రూపాయలు అలవెన్స్ అందించటంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి , మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు ఎంపీపీ మోహన్, కృతజ్ఞతలు తెలియజేసాడు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూతకోల కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..తెలుగు, కన్నడ భాషలలో దూసుకుపోతున్న కాంతారా సినిమా హిందిలో కూడా దూసుకుపోతోంది. హిందీలో విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు రూ. 13.10 కోట్లు వసూలు చేసింది.