కేజీఫ్ 2 రికార్డ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన కాంతారా…?

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన కాంతారా సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో అతి చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15వ తేదీన తెలుగులో కూడా విడుదల చేశాడు.

ఇలా కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల మౌత్ టాక్ పబ్లిసిటీతో ఈ సినిమా ముందుకి దూసుకుపోతోంది. ఇలా భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఈ కాంతారా సినిమాని హోం భలే సంస్థ నిర్మించింది. కర్ణాటకలో ఇప్పటివరకు హోం భలే సంస్థ నిర్మించిన సినిమాలలో కాంతారా సినిమా అత్యధిక వసూలు చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

గతంలో ఈ హోం వాలే సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన
కే జి ఎఫ్ 2 సినిమా కూడా పవన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. అయితే తాజాగా విడుదలైన ఈ కాంతారా సినిమా కేజిఎఫ్ 2 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి కేజిఎఫ్ 2 కన్నా ఎక్కువ వసూళ్లు చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ కాంతారా సినిమా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత వసూళ్లు సాధించి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.