కన్నడ సూపర్ స్టార్ అప్పు సమాధికి నివాళులు అర్పించిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు వరస బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఆగస్టు 25వ తేదీన వన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల బెంగళూరు వెళ్ళిన విజయ్ దేవరకొండ అక్కడ కంఠీరవ స్టేడియానికి వెళ్లి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించి నివాళులు అర్పించారు.

పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ లో కార్డియాక్ అరెస్ట్ వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరో అయినప్పటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఇప్పటికి పునీత్ అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తో హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా పునీత్ సమాధిని దర్శించి నివాళులు అర్పించారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కి కూడా పునీత్ రాజ్ కుమార్ తో మంచి అనుబంధం ఉంది. తెలుగులో విడుదలైన పోకిరి సినిమాని కన్నడ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ రీమెక్ చేశాడు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

అలాగే కొన్ని రాజ్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్ కుమార్ కి కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల లో కూడా మంచి గుర్తింపు ఉంది. దీంతో పలువురు టాలీవుడ్ హీరోలు కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియచేశారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్ ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.