“ప్రాజెక్ట్ కే” లో కమల్ వచ్చేది, తన శాలరీ డీటెయిల్స్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా వినిపిస్తున్న ఒకే ఒక్క హీరో పేరు ప్రభాస్ కాగా తన సినిమా ఆదిపురుష్ రిలీజ్ రేపు ఉండడంతో అంతా ఇదే హాట్ టాపిక్ గా అయితే మారింది. ఇక ఈ భారీ చిత్రం తర్వాత వరుసగా మరిన్ని భారీ రిలీజ్ లతో ప్రభాస్ రెడీ అవుతుండగా వీటిలో వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి.

మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా అమితాబ్, దీపికా పదుకొనె అలాగే దిశా పటాని లాంటి సెన్సేషనల్ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ఇక రీసెంట్ గా మరో క్రేజీ ఎడిషన్ గా ఉలగనయగన్ కమల్ హాసన్ ఈ సినిమాలో ఉన్నట్టుగా ఓ గాసిప్ బయటకి రాగ దీనితో సినిమా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళింది.

కాగా ఈ సినిమాలో కమల్ విలన్ గా నటిస్తున్నారని వచ్చిన బజ్ ఇప్పటికీ ఆసక్తిగా ఉండగా ఇపుడు మరో క్రేజీ బజ్ తెలుస్తుంది. కమల్ హాసన్ పై అయితే షూటింగ్ ఈ ఆగష్టు లో మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. అలాగే ఈ భారీ చిత్రం కోసం కమల్ ఏకంగా 10 అంకెల శాలరీ అయితే తీసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ భారీ సినిమా కి కమల్ లెక్క 100 కోట్లు ఉంటుంది అని తెలుస్తుంది. గతంలో అయితే 150 కోట్లు తీసుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి కానీ ఇపుడు అయితే ఈ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో మంచి వైరల్ గా మారింది.