యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఇండియన్ మైథాలజీ పాయింట్ ని ఫ్యూచర్ కి కనెక్ట్ చేసి సూపర్ హీరో ఫాంటసీ చిత్రంగా ప్రాజెక్ట్ కె ని సిద్దం చేస్తున్నారు.
ఈ చిత్రంలో అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సమయంలో మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం కమల్ హాసన్ ని ఎంపిక చేయడం విశేషం. అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
కమల్ హాసన్ రాకతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడం వెనుక ఓ కీలక వ్యక్తి హస్తం ఉందంట. ప్రాజెక్ట్ కె మూవీకి సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఆయన పర్యవేక్షణలో సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇక మూవీలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రకి కచ్చితంగా ఒక స్టార్ క్యాస్టింగ్ ఉండాలని డిసైడ్ అయ్యారంట. ఈ సందర్భంగా సింగీతం కమల్ హాసన్ పేరుని రిఫర్ చేయడంతో పాటు ఆయనతో మాట్లాడటం కూడా జరిగిందంట. ఇక నాగ్ అశ్విన్ చెన్నై వెళ్లి కమల్ హాసన్ కి ఈ మూవీ కథ కూడా వినిపించారంట.
ఇక కథ విన్న తర్వాత నచ్చడంతో పాటు తాను గురువులా భావించే సింగీతం శ్రీనివాసరావు సజిస్ట్ చేయడంతో కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే మూవీలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని, అందుకే ఒప్పుకున్నారని ఇండస్ట్రీ వర్గాల మాట.