ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో కమల్ బిగ్ అప్డేట్ ఎప్పుడంటే.!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర నుంచి ఇండియన్ సినిమా తాలూకా గేమ్ ఛేంజింగ్ సినిమాగా అయితే మారే వాటిలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం డెఫినెట్ గా ఇండియన్ సినిమా నుంచి ఒక పాత్ బ్రేకింగ్ చిత్రం అవుతుంది అని టాక్ ఉంది.

మరి ఈ చిత్రం లో అయితే ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరితో పాటుగా లేటెస్ట్ గా ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నట్టుగా టాక్ ఉంది. అయితే ఈ అంశం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెలుస్తుంది.

కమల్ ఈ చిత్రంలో డెఫినెట్ గా ఉన్నారట. పైగా దీనిపై అనౌన్సమెంట్ బిగ్ అప్డేట్ కూడా రాబోతుంది అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఆ సెన్సేషనల్ అప్డేట్ ఎప్పుడో కాదు ఈరోజే రావచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కమల్ అయితే ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తారని తెలిసిందే.

అయితే కమల్ పై నెల రోజుల పాటుగా షూటింగ్ అయితే జరగనుందట. మరి ఈ బిగ్ అప్డేట్ ఏ సమయానికి వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో దిశా పటాని కూడా కీలక పాత్రలో నటిస్తుండగా అశ్వని దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమా దగ్గర కాస్ట్లీ చిత్రంగా నిర్మాణం వహిస్తున్నారు.