“కల్కి” తర్వాత మరో భారీ సినిమాలో కమల్ క్యామియో?

ఇండియన్ సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది సీనియర్ స్టార్ హీరోస్ లో కోలీవుడ్ ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఒకరు. మరి కమల్ హాసన్ ఇప్పుడు చేస్తున్న అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్లోనే ఉండగా తాను హీరోగా మాత్రమే కాకుండా పలు భారీ చిత్రాల్లో క్యామియో రోల్స్ కి కూడా కమల్ హాసన్ ఇపుడు ఓకే చెప్తుండడం ఆసక్తిగా మారుతుంది.

రీసెంట్ గానే టాలీవుడ్ భారీ చిత్రం “కల్కి” లో నటించేందుకు కమల్ హాసన్ ఓకే చెప్పగా ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ అయ్యితే వర్క్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రంలో కమల్ క్యామియోలో కనిపించనుండగా ఇప్పుడు మరో చిత్రానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

మరి ఈ చిత్రం అయితే తమిళ్ హీరో శింబు తో దర్శకుడు పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా అట. కాగా ఈ చిత్రం శింబు కెరీర్ లో 48వ సినిమా కాగా ఈ చిత్రంని మేకర్స్ భారీ మొత్తంలో 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారట. అలాగే ఇది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారట.

మరి ఇందులో కమల్ కోసం ఓ ఇంపార్టెంట్ క్యామియో రోల్ ని దర్శకుడు డిజైన్ చేయగా దానికి కమల్ హాసన్ ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే కమల్ హీరోగానే కాకుండా ఇలాంటి రోల్స్ కూడా నెమ్మదిగా చేస్తున్నారని చెప్పాలి.