కళ్యాణ్ రామ్ కూడ రెండు ముక్కలు చేస్తాడట

Kalyan Ram to make Bimbisara into two parts
Kalyan Ram to make Bimbisara into two parts
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘బింబిసార’.  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉండనుంది.  వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్య మహారాజు బింబిసార పాత్రను పోషిస్తున్నారు. పిరియాడికల్, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ సినిమా.
 
ఎన్టీఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఒకరకంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ హీరోగా ఇంత పెద్ద సినిమాను మరో నిర్మాత ఎవ్వరూ నిర్మించరు.  అందుకే కళ్యాణ్ రామ్ స్వయంగా డబ్బు పెట్టుకుంటున్నారు.  ఒక రకంగా ఇది రిస్క్ అనే అనాలి.  
 
డైరెక్టర్ వశిష్ట్ కూడ కొత్త దర్శకుడే.  కళ్యాణ్ రామ్ డబ్బు అయితే పెట్టగలిగాడు కానీ మార్కెటింగ్ దగ్గరే చిక్కొచ్చిపడింది.  సినిమా బడ్జెట్ పెద్దది కాబట్టి అమ్మకం కూడ భారీగానే ఉండాలి.  కాకపోతే కళ్యాణ్ రామ్ సినిమాను అంత పెద్ద మొత్తం పెట్టి ఎవరు కొంటారు.
 
అందుకే పెట్టుబడి వెనక్కి రాబట్టడానికి కళ్యాణ్ రామ్ కొత్త దారి వెతుక్కున్నాడు. సినిమాను రెండు ముక్కలు చేయాలని డిసైడ్ అయ్యారట. రెండు భాగాలుగా విక్రయిస్తే నిర్మాతల మీద కూడ పెద్ద బర్డెన్ పడదు. 
 
ఒక భాగం ఒకరు కొంటె రెండవ భాగం ఇంకొకరు కొనే అవకాశం ఉంది.  అప్పుడు పెట్టుబడి ఈజీగా వెనక్కి వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ మొదటి పార్ట్ హిట్ అయితే రెండవ పార్ట్ పెద్ద మొత్తానికి అమ్ముడై లాభాలు కూడ చూడవచ్చు అనేది కళ్యాణ్ రామ్ ఆలోచన.