ఇప్పుడు మన తెలుగు సినిమా ఏ రేంజ్ లో రైజ్ అవుతుందో చూస్తున్నాము. మరి భారీ సినిమాలతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు సీక్వెల్స్ మన తెలుగు నుంచి వస్తున్నాయి. ఇక అలా మంచి అంచనాలు నడుమ వస్తున్న మరో భారీ చిత్రమే “బింబిసార”.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ ట్రెసా అలాగే “భీమ్లా నాయక్” ఫేమ్ సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన భారీ బడ్జెట్ సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎపుడు స్టార్ట్ చేసారో తెలీదు కానీ షాకింగ్ గ్లింప్స్ తో మేకర్స్ మాత్రం ఏ రేంజ్ సినిమా ఎప్పుడు తీసారా అని అంతా షాకయ్యారు.
ఇక ఎలాగో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ భారీ సినిమాని కూడా కళ్యాణ్ రామ్ నే నిర్మాణం వహించాడు. అయితే ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కాకుండానే ఈ చిత్రానికి భారీ నష్టం ఆల్రెడీ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాని దర్శకుడు వశిష్ట్ చాలా గ్రాండ్ గా భారీ సెట్స్ మరియు గ్రాఫిక్స్ ఏక్షన్ లో ప్లాన్ చేసాడు. మరి వీటి అన్నిటికి కలిపి ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిందట. కానీ సినిమాకి జరిగిన బిజినెస్ మాత్రం 20 కోట్ల లోపే అని తెలుస్తుంది. అంటే బడ్జెట్ పరంగా కళ్యాణ్ రామ్ కి 20 కోట్లు నష్టం ఆల్రెడి కనిపిస్తుంది.
దీనితో సినిమా బాక్సాఫీస్ వసూళ్లపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ వసూళ్ల పరంగా మంచి ఓపెనింగ్స్ దక్కితే మాత్రం నిర్మాతగా కళ్యాణ్ రామ్ గట్టెక్కుతాడు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా థియేటర్స్ లో రియల్ మ్యాజిక్ చెయ్యాల్సి ఉంది.