మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి అల్లుడిగా వచ్చేశాడు. అంతేకాకుండా విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. మొదటి సినిమా కాబట్టి మెగా అండ కూడా ఉంది. అంతే కాకుండా చిరంజీవి విజేత టైటిల్‌ను కూడా వాడుకున్నారు. అన్నీ చేసినా సరే హీరోగా నిలబెట్టలేకపోయారు. విజేత సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
విజేత వచ్చి చాలా రోజులే అవుతున్నా.. మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు మాత్రం తీసుకురాలేకపోతున్నాడు. మధ్యలో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ అది అటకెక్కింది. మళ్లో ఓ ద్విభాషా చిత్రాన్ని పట్టాలెక్కించాడు. సూపర్ మచ్చి చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది కాస్తా ఆలస్యమవుతూనే వస్తోంది. అలాంటి చిత్రంపై కరోనా పిడుగులా పడింది. లాక్డౌన్ వల్ల సినిమా మరింత ఆలస్యమైంది.
సూపర్ మచ్చి చిత్రంలో కన్నడ భామ రచిత రామ్ నటిస్తోంది. ఈ హీరోయిన్‌కు కన్నడలో మంచి ఫాలోయింగే ఉంది. ఈ మధ్యే సూపర్ మచ్చి షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. నిన్న (అక్టోబర్ 3) రచితా రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు కళ్యాణ్ దేవ్ విషెస్ తెలిపాడు. షూటింగ్‌లొ భాగంగా దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే అని చెప్పాడు. ఆ ఫోటో చూస్తే ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరి క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. మరి తెరపై ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.