కల్కీ కన్ఫ్యూజన్.. డైరెక్టర్ ఏమన్నారంటే..

మహానటి సినిమాతో దర్శకుడిగా మరో లెవెల్ కు వెళ్లిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో అవకాశాన్ని అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ప్రొడక్షన్స్ లో తెరపైకి రాబోతున్న కల్కి 2898 AD సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను రెండు భాగాలుగా దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తప్పకుండా సినిమా హాలీవుడ్ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అయితే ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేయగా పరవాలేదు అనిపించింది. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు క్రియేట్ చేయలేకపోయింది. ఇక తదుపరి అప్డేట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని దర్శకుడు అడుగులు వేస్తున్నాడు.

ఈ క్రమంలో ఒక మీడియా ఇంటరాక్షన్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కల్కి సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఫినిష్ అయింది కేవలం కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది తప్పకుండా దాన్ని వీళ్ళనంత త్వరగా పూర్తి చేస్తాము. ప్రస్తుతం టీమ్ మొత్తం కూడా దాని పైన ఫోకస్ చేస్తున్నాము. ఇక ఎప్పుడు చూడని ఒకసారి కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారు.

ప్రభాస్ కూడా న్యూ లుక్ తో ఆకట్టుకుంటాడు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అలాగే రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒక మంచి రోజు చూసుకుని అప్డేట్ ఇస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చాడు. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు సమ్మర్ కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రెండిటిలో క్లారిటీ రావాలి అంటే అధికారికంగా మరోసారి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సిందే.