‘కల్కీ 2898 AD’ రెండు భాగాలు.. ఎందుకంటే?

50 సినిమాలను నిర్మించిన అనుభవం ఉన్న ప్రొడక్షన్ హౌస్ ‘వైజయంతి మూవీస్’ లో ప్రభాస్ హీరోగా మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీగా ‘కల్కీ 2898AD’ రూపొందుతోంది. దాదాపు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ గ్లింప్స్ ను ఏకంగా అమెరికాలో బిగ్గెస్ట్ ఈవెంట్ లో విడుదల చేసి వరల్డ్ వైడ్ గా సినిమాపై ఫోకస్ అయ్యేలా చేశారు.

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. అసలైతే మొదట ఈ 2 పార్ట్స్ అనే ఆలోచనే లేదు. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తరువాత మొదట 500 కోట్లు అనుకోలేదట. అంతకంటే తక్కువ బడ్జెట్ అనుకున్నారట. కానీ షూటింగ్ ముందుకు కొనసాగుతున్న కొద్దీ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైపోయిందట.

దీంతో నిర్మాత అశ్వినీ దత్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చర్చలు జరిపి రెండు భాగాలుగా సినిమాను రూపొందించాలని అడ్వైస్ చేశారట. సినిమాపై పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలి అంటే అదే బెస్ట్ అప్షన్ అని చెప్పడంతో నాగ్ అశ్విన్ కథను మరింత డెవలప్ చేసుకొని రెండు భాగాలుగా డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఇక Kalki 2898 AD ఫస్ట్ పార్ట్ 2024 సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ భాగాన్ని 2025 లో తీసుకురావచ్చని ఇన్ సైడ్ టాక్.