కొత్త ఎనర్జీతో ‘కల్కి-2’ పార్ట్‌.. మరో ఆరు నెలల్లో షూటింగ్‌ ప్రారంభం

పాన్‌ ఇండియా నటుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్‌ బస్టర్‌ ‘కల్కి’. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదలై సూపర్‌హిట్‌ అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.

ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్‌ ఉందని నాగ్‌ అశ్విన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌ను అయితే ప్రకటించారు కానీ ఎప్పుడు మొదలుపెట్టనున్నారు అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా ‘కల్కి 2’ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు నిర్మాతలు స్వప్నదత్‌- ప్రియాంకదత్‌లు. వీరిద్దరూ.. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో పాల్గొని అక్కడి విూడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మూవీ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

ఈ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌పై నిర్మాత ప్రియంకా దత్‌ మాట్లాడుతూ.. ‘కల్కి 2’ షూటింగ్‌ మరో ఆరు నెలల్లో మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. ఒక్కసారి మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అయితే వరుస అప్‌డేట్‌లను ఇస్తాం అని తెలిపారు. స్వప్నా దత్‌ మాట్లాడుతూ.. మొదటి పార్ట్‌ కంటే పార్ట్‌ -2 మూవీ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా ఉన్నాం. ‘కల్కి’ నుంచి చాలా నేర్చుకున్నాం. కొత్త ఎనర్జీతో ;కల్కి 2;ను మొదలుపెట్టబోతున్నాం అంటూ చెప్పుకోచ్చింది.