కల్కీ 2898 AD – ఈ పాయింట్స్ గమనించారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. మైథలాజికల్ క్యారెక్టర్స్ తో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. అమితాబచ్చన్ సినిమాలో పరశురాముడి పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తన్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. అలాగే మూవీ టైటిల్ కూడా ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇండియన్ మైథాలజీని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

నాగ్ అశ్విన్ చాలా పెర్ఫెక్ట్ గా ఈ ఎలిమెంట్స్ ని ఆవిష్కరించారని చెప్పొచ్చు. పద్మాకారం షేప్ ఉన్న ఒక ప్లేస్ ని గ్లింప్స్ లో చూపించారు. అలాగే హనుమాన్ పెండెంట్ ని కూడా విలన్ చేతిలో చూపించారు. దీంతో పాటు పరశురాముడు తపస్సు చేసుకున్న స్థలంలో శివలింగాన్ని చూపించారు. అలాగే పరశురాముడు ఆయుధమైన పరుషవేదిని గ్లింప్స్ రిప్రజెంట్ చేశారు.

అమితాబచ్చన్ జనన యోగా స్థితి నుంచి బయటకి వచ్చే సీన్ ని ఆవిష్కరించారు. అలాగే నందక ఖడ్గం కూడా గ్లింప్స్ కనిపించింది. దాంతో పాటుగా కల్కి అవతారంలో సూపర్ హీరోగాగా ఉన్న ప్రభాస్ సుదర్శన చక్రాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు విజువల్స్ చూపించారు. ఇలా ప్రతి ఫ్రేమ్ లో కూడా హిందూ గ్రంధాలలో చెప్పబడిన అస్త్రాలు, అంశాలని ప్రామాణికంగా తీసుకొని ఎక్కడా కూడా మిస్ చేయకుండా గ్లింప్స్ లో ఆవిష్కరించారు.

దీనిని బట్టి కల్కి 2898 ఏడీ సినిమాని నాగ్ అశ్విన్ ఇండియన్ హిందూ మైథాలజీని ఎంత డెప్త్ గా స్టడీ చేసి తెరకెక్కిస్తున్నారో చెప్పొచ్చు. పురాణ ఇతిహాసాలని వక్రీకరించకుండా కరెక్ట్ గా అర్ధం చేసుకుంటే వాటిని సిల్వర్ స్క్రీన్ పై అంతే అద్భుతంగా ఆవిష్కరించగలిగితే హాలీవుడ్ లో మర్వెల్ సినిమాలు కూడా ఇండియన్ కథల ముందు సరిపోవు అని చెప్పొచ్చు.