మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘కల్కి’.. వచ్చే నెలలోనే ఓటిటిలోకి అంటూ వార్తలు

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘కల్కి 2898 ఏడీ. సినిమా రిలీజై రెండు వారాలు పూర్తిచేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉన్న బుజ్జి కారు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది.

ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఓటీటీలో మొదటగా ఈ సినిమాను హిందీ భాషలో విడుదల చేసి.. ఆ తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో అమోజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఆగష్టు 15న రిలీజ్‌ అవుతున్నట్లు సమాచారం.