‘కల్కి’ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది ప్రసాద్‌ ఐ మాక్స్‌ వద్ద సందడి

ప్రసాద్‌ ఐ మాక్స్‌ వద్ద సందడి రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన ‘బుజ్జి’ (వాహనం)ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాని వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఐమాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.