కలెక్షన్లలో ‘కల్కి’ దుమారం… 4రోజుల్లోనే రూ.555 కోట్ల మార్క్‌ టచ్‌!

టాలీవుడ్‌తో పాటు వరల్డ్‌ వైడ్‌గా ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతుంది. మొదటిరోజు నుంచే కలెక్షన్ల సూనావిూ సృష్టిస్తున్న ఈ చిత్రం నాలుగో రోజు కూడా అదే రిపీట్‌ చేసింది. పాన్‌ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా వైజయంతీ మూవీస్‌ తెరకెక్కించింది.

ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్‌ 27న ప్రేక్షకుల మందుకు వచ్చి మొదటి రోజు నుంచే భారీ వసూళ్లును రాబడుతుంది. ఓపెనింగ్‌ రోజే రూ.191.50 కోట్లు వసూల్‌ చేసిన సినిమా మూడు రోజుల్లోనే రూ.415 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా కలెక్షన్స్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా 4రోజుల్లోనే రూ.555 కోట్ల మార్క్‌ టచ్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ‘కల్కి’ ఐదో సినిమాగా నిలిచింది.

ఇంతకుముందు ఈ రికార్డు ‘బాహుబలి 1, 2’, ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌ పేరిటా ఉన్నాయి. విశేషం ఏంటంటే ఇందులో నాలుగు సినిమాలు ప్రభాస్‌వే కావడం విశేషం. మరోవైపు ఈ వారం టికెట్లు రేట్లు తగ్గనుండడంతో మూవీ కలెక్షన్లు మరింత పేరిగే అవకాశం ఉంది.

సినిమాలో ప్రభాస్‌, దీపికా పదుకోణె, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్‌, శోభన తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా.. టాలీవుడ్‌ స్టార్‌ నటుడు విజయ్‌ దేవరకొండ అర్జునుడి పాత్రలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఒక యోధుడి పాత్రలో కనిపించాడు. ఇంకా వీళ్లే కాకుండా ‘సీతారామం’ భామ మృణాల్‌ ఠాకూర్‌, మలయాళ నటి అన్నా బెన్‌, హాస్య నటుడు బ్రహ్మానందం, టాలీవుడ్‌ దర్శకులు ఆర్జీవీ, రాజమౌళి, జాతి రత్నాలు దర్శకుడు కేవీ అనుదీప్‌, ఫరియా అబ్దుల్లా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ఇందులో నటించారు.