Kajal Aggarwal: తల్లయ్యాక మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన కాజల్… నిద్రలేని రాత్రులు అంటూ పోస్ట్!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మంగళవారం ఉదయం ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా తనకు కొడుకు పుట్టిన విషయాన్ని తన భర్త గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అదేవిధంగా తన కొడుకు పేరు నీల్ అని నామకరణం చేసినట్లు ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ కొడుకు పుట్టాడనే విషయం తెలియగానే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొదటిసారిగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కాజల్ స్పందిస్తూ బేబీ నీల్ ను ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన కొద్ది క్షణాలకే ఒక తెల్లటి వస్త్రంలో తనని గుండెలకు హత్తుకున్నప్పుడు నాలో ఏదో తెలియని అనుభూతి కలిగింది అలాగే బిడ్డ పట్ల ఉండాల్సిన బాధ్యతను కూడా తెలియజేసింది. అయితే ఇదంతా చాలా సులభంగా జరుగలేదు.

మూడు రోజులపాటు నిద్రలేని రాత్రులు గడపడమే కాకుండా, అధిక రక్తస్రావం, ఒత్తిడి, నొప్పి, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్‌ పంప్స్‌ తో సతమతమయ్యాను. అయితే ఎప్పుడైతే తన బిడ్డను గుండెలకు హత్తుకున్నానో ఆ క్షణం తాను అనుభవించిన నొప్పి మొత్తం మర్చిపోయానని కాజల్ తెలియజేశారు. ప్రసవం తరువాత ఇది అంత ఆకర్షణీయంగా ఉండకపోయినా చాలా ఆనందంగా ఉంది అంటూ కాజల్ అగర్వాల్ తన బిడ్డ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.