కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

Surprise element in Acharya

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన సినిమాలలో నటించే విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గత రెండు సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ పూర్తిగా తన వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు జన్మించారు.

ఇక కాజల్ అగర్వాల్ తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అని తెలియడంతో చాలామంది ఇతను బ్యాగ్రౌండ్ గురించి ఆలోచించారు. అయితే ఈయన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఈయనకు ముంబైలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఈయన పెద్ద వ్యాపారస్తుడే అని చెప్పాలి. గౌతమ్ తన ఇంటీరియర్ డిజైన్ కంపెనీ భారీ మొత్తంలో ఆస్తిపాస్తులను కొనుగోలు చేశారు.ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియల్ కంపెనీ అంచనాల ప్రకారం గౌతమ్ నికర ఆస్తులు విలువ 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

తనకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటీరియర్ బిజినెస్ రంగంలో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ముంబైలో పలు కంపెనీలు ఉండటమే కాకుండా ఆన్లైన్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఇలా ఓ ప్రముఖ వ్యాపారవేత్త గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితురాలు కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమకు దారి తీసి పెళ్లి వరకు కొనసాగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఈ విధంగా కాజల్ ఒక వైపు సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఉండగా గౌతమ్ వ్యాపారంలో ఎంతో మంచి లాభాలను అందుకుంటూ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు.