బ్యాగులు స‌ర్దేసుకున్నాం.. ఇక హ‌నీమూన్ వెళ్ల‌డ‌మే త‌రువాయి అంటున్న కాజ‌ల్‌

చూడ చక్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. 15 ఏళ్ళ‌పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌థానాయిక‌గా న‌టిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ఈ భామ అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూని కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహ‌మాడింది. ఆ త‌ర్వాత రిసెప్ష‌న్ జ‌రుపుకున్న ఈ జంట నూత‌న గృహ ప్రవేశం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోల‌ను కాజ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక క‌ర్వా చౌత్ సంద‌ర్భంగా ఎర్రటి చీర ధ‌రించి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా రెడీ అయిన కాజ‌ల్ ఉప‌వాస దీక్ష కూడా చేసింది.

కాజ‌ల్ హ‌నీమూన్ టూర్‌పై కొద్ది రోజులుగా అనేక క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. వ‌రుస షూటింగ్స్ ఉండ‌డంతో కొద్ది రోజుల త‌ర్వాత ఈ జంట హ‌నీమూన్ వెళ్ల‌నున్నార‌ని కొంద‌రంటే మ‌రి కొందరు బ్రేక్ తీసుకొని ఈ నెల‌లోనే వెళ‌తార‌ని రాసుకొచ్చారు. అయితే తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హ‌నీమూర్ టూర్‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. బ్యాగ్‌లు, పాస్ట్‌పోర్ట్‌లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ… `బ్యాగులు సర్దేసుకున్నాం`, `రెడీ టు గో` అంటూ విమానం ఎమోజీలు ఉన్న ఫోటోలని షేర్ చేసింది కాజ‌ల్‌. దీంతో అభిమానులు, నెటిజ‌న్స్ వారికి హ్యాపీ జ‌ర్నీ చెబుతున్నారు. క‌రోనా త‌క్కువ ఉన్న ప్రాంతానికి ఈ నూత‌న దంప‌త‌లు హ‌నీమూన్ టూర్‌గా వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

హ‌నీమూన్ నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆచార్య షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఆచార్య షూటింగ్ న‌వంబ‌ర్ 9 నుండి మొద‌లు కానుండ‌గా, ముందుగా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌పై కొన్ని ముఖ్య స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ట కొర‌టాల‌. కాజ‌ల్ వ‌చ్చాక చిరు కాంబినేష‌న్‌లో సీన్స్ , సాంగ్స్ షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాజ‌ల్ ఆచార్య సినిమాతో పాటు పారిస్ పారిస్, భారతీయుడు 2, ముంబై సాగా అనే చిత్రాల‌లో న‌టిస్తుంది. పెళ్లి త‌ర్వాత ప్ర‌తి రోజు ఫొటో షూట్స్ చేస్తున్న కాజ‌ల్ అంద‌మైన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి నెటిజ‌న్ల మ‌న‌సులు దోచుకుంటుంది