Home Entertainment కాజల్‌ అగర్వాల్ పెళ్లి ఫిక్స్.. ఆ పోస్ట్ అర్థం అదే.. ఆ లక్కీ బాయ్ ఎవరంటే?

కాజల్‌ అగర్వాల్ పెళ్లి ఫిక్స్.. ఆ పోస్ట్ అర్థం అదే.. ఆ లక్కీ బాయ్ ఎవరంటే?

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కానీ ప్రస్తుతం సెలెబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం మీడియానే చేసేస్తుంటాయి. ఎప్పుడు ఎవరితో లింకులు పెట్టి వార్తలు రాస్తారో.. ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేస్తారో చెప్పడం కష్టం. గతకొన్ని రోజులుగా కాజల్ పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు మాత్రం సోషల్ మీడియా అంతా కాజల్ పెళ్లి గురించి కోడై కూస్తోంది. ఆ వార్తలకు తగ్గట్టే కాజల్ ఓ పోస్ట్ చేసింది.

Kajal Aggarwal Is Tied Knot With Gautam Kitchlu
Kajal Aggarwal Is Tied Knot With Gautam Kitchlu

నేటి ఉదయం నుంచి వినిపిస్తున్న కథనం ప్రకారం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతున్నారట.  లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందట. కాజల్ ఇంకా గౌతమ్ ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారట. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అట. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారట.

Kajal Aggarwal Is Tied Knot With Gautam Kitchlu
Kajal Aggarwal Is Tied Knot With Gautam Kitchlu

 అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కాజల్ తాజాగా ఓ పోస్ట్ చేసింది. లవ్ సింబల్ ఉన్న ఫోటోను ఒకటి కాజల్ పోస్ట్ చేసింది. దీంతో కాజల్ ఫ్యాన్స్ అందరి హృదయం బద్దలైంది. కాజల్ పెళ్లి చేసుకోకు.. మమ్మల్ని ఇలా వదిలేయకు.. మా గుండె బద్దలవుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కాజల్ తనకు కాబోయే భర్త ఫోటోను ఎప్పుడు పోస్ట్ చేస్తుందో చూడాలి.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News