టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాలో మొత్తానికి పెళ్లి చేసుకోబోతోంది. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనే ఈ అక్డోబర్ 30న వివాహమాడబోతోంది. ఎప్పటి నుంచో వీరి మధ్య కథ నడుస్తున్నా ఏనాడు బయటకు రాలేదు. ఒక్కసారి పెళ్లి ఫిక్స్ అయిందని, గౌతమ్ కిచ్లూను వివాహామాడబోతోన్నానని ప్రకటించిందో అప్పటి నుంచి వీరి పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ కిచ్లూ ముంబైలో బడా వ్యాపారవేత్త అని తెలుస్తోంది. సొంతంగా కంపెనీ కూడా ఉంది. కోట్లకు పడగలెత్తి ఉన్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక పెళ్లి తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాజల్ బిజీ అవుతోంది. తాజాగా కాజల్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన నిశ్చితార్థపు ఉంగరం, చేతి గోళ్లను, కాలి వేళ్లను చూపిస్తూ సంబరపడిపోయింది. మొత్తానికి బాగానే రెడీ అవుతోన్నానని తెలిపింది.
ఆ మధ్య గౌతమ్ కిచ్లూ షేర్ చేసిన ఎంగేజ్మెంట్ ఫోటోలో ఉన్న సృజనాత్మకతను కాజల్ గుర్తించింది. తన భర్త ప్రతిభను అందరి ముందే సోషల్ మీడియాలో పొగిడేసింది. మామూలుగా తన బిజినెస్ ఫోటోలు తప్పా మరేతర ఫోటోలు షేర్ చేయని గౌతమ్ మొదటి సారిగా కాజల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. తాజాగా కాజల్ ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అందులో తన నెయిల్ పాలీష్ ఎలా ఉందో చూపించింది. అందులో ఎంగేజ్మెంట్ రింగ్ బాగా వైరల్ అవుతోంది.