మల్లెపూల ఫోటోను షేర్ చేసిన కాజల్.. వ్యవహారం తేడాగా ఉందే!

Kajal Aggarwal About Flowers Fragrance

కాజల్ అగర్వాల్ అసలే హనీమూన్ జోష్‌లో ఉంది. కాజల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30ను వివాహాం చేసుకుంది. నవంబర్ మొదటి వారంలో హనీమూన్‌కు చెక్కేసింది. అలా హనీమూన్‌లో ఈ కొత్త జంట చేసే సందడికి సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. కాజల్ హనీమూన్‌ను చూసి అందరూ కుళ్లు కుంటున్నారు. అండర్ వాటర్ రొమాన్స్, అక్వేరియం లాంటి బెడ్రూం.. బీచ్‌లో సరసాలు.. అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే కాజల్ గౌతమ్ విన్యాసాలు మామూలుగా లేవు.

Kajal Aggarwal About Flowers Fragrance
Kajal Aggarwal About Flowers Fragrance

మొత్తానికి కాజల్ మాత్రం దుమ్ములేపుతోంది. ఇటు ఇంటర్వ్యూలు ఇస్తూ పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ చెబుతూనే ఉంది. మరో వైపు కాజల్ తన కొత్త వ్యాపారాన్ని మొదలెట్టేసింది. గేమింగ్ బిజినెస్‌లో కాజల్ వందల కోట్ల పెట్టుబడి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే కాజల్ మాత్రం ఇంకా మాల్దీవుల్లోని హనీమూన్ టైం, ఆ ఎంజాయ్మెంట్‌ను ఇంకా మరిచిపోలేకపోతోన్నట్టు కొడుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మల్లెపూల ఫోటోను షేర్ చేసిన కాజల్ అదిరిపోయే కామెంట్ చేసింది. ఇక మన తెలుగు సినిమాల్లో మల్లెపూలకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. వాటిని చూపిస్తే తరువాత వచ్చే సీన్ ఏంటో అందరికీ తెలిసిందే. అదొక సింబాలిక్‌గా అయిపోయింది. అలా కాజల్ మల్లెపూల వాసన గురించి గొప్పగా చెబుతూ వచ్చింది. ఇలా మల్లెపూల గురించి కాజల్ చెబుతూ ఉండటంతో అందరూ షాక్అవుతున్నారు. నాటీ కాజల్ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.