బాక్సాఫీస్ : “కబ్జా” ఫేక్ వసూళ్ల ముచ్చట.!

ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియా సినిమాల డామినేషన్ అయితే పాన్ ఇండియా లెవెల్లో కనబరుస్తున్నాయి. మరి ఆ చిత్రాల్లో కన్నడ నుంచి వస్తున్న సినిమాలు కూడా ఉండగా వాటి ప్రకారం వచ్చిన చిత్రాల్లో “కబ్జా” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏదో అవుతుంది అనుకుంటే పాన్ ఇండియా లెవెల్లో అయితే అనుకోని రేంజ్ హిట్ గా మారింది.

మొదటి రోజే భారీ వసూళ్లు అందుకుంటుంది అనుకుంటే చెప్పుకోలేని రేంజ్ వసూళ్లు అందుకుంది. అయితే మేకర్స్ మాత్రం ఎక్కువ నంబర్స్ నే షేర్ చేసుకుంటున్నారు పైగా బ్లాక్ బస్టర్ వేడుకలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇక రెండో రోజుకి అయితే ఏకంగా 100 కోట్లు కొట్టేసింది అని కొన్ని పోస్టర్ లు దర్శనం ఇస్తున్నాయి.

కానీ ఈ సినిమా అయితే ఇంత వసూళ్లు అందుకోలేదని రెండో రోజుకే ఒక్క హిందీ ఇతర భాషల్లోనే కాకుండా ఒరిజినల్ కన్నడ భాషలో కూడా రిజెక్ట్ చేసారని తెలుస్తుంది. దీనితో రెండో రోజుకి ఏకంగా 50 పర్సెంట్ కి పైగా డ్రాప్ అవ్వగా ఫేక్ పోస్టర్ లు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. దీనితో కబ్జా వసూళ్ల విషయంలో ఎలాంటి నిజం లేదు అనేది కన్ఫర్మ్.

ఇదిలా ఉండగా కొందరు ఈ ఫేక్ వసూళ్ల పోస్టర్స్ విషయంలో సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి మరీ ఇంత పచ్చి అబద్దాలు షేర్ చేసుకోవడం వారి ఇండస్ట్రీ ని దిగజార్చుకున్నట్టు ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహించగా శ్రేయ హీరోయిన్ గా నటించింది. అలాగే కిచ్చా సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ లు కీలక పాత్రల్లో నటించారు.
https://twitter.com/appudynasty1/status/1637401883018145792