కబ్జా.. పది లక్షలు కూడా కొట్టలేకపోయిందిగా!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా. ఈ శుక్రవారం అంటే మార్చి 17న థియేటర్లలో రిలీజ్ అయింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నాట ఆ స్థాయిలో ఆసక్తి రేపిన మూవీ కావడంతో ఈ సినిమా కూడా మరో కేజీఎఫ్ అవుతుందని అంతా నమ్మారు. అయితే ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు ఇది కేజీఎఫ్ సెట్లోనే తీసిన మరో సినిమా… అచ్చూ దానిలాగే ఉందని విమర్శలు కూడా వచ్చాయి.

అయినా ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కేజీఎఫ్కు కాపీ అని, ఆ సినిమాలో ఎడిటింగ్లో లేపీసిన సీన్స్తో ఈ సినిమా చేశారా? అంటూ విమర్శలు వచ్చాయి. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక బాలారిష్టాలు ఎదుర్కొని పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు రిలీజ్ అయింది. కేజీఎఫ్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇరగదీసిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించడంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలోని ఏ ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా ఈ సినిమా పది లక్షల మార్క్ అందుకోలేక పోయింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఎర్లీ రిలీజులు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయి. కానీ అదేం విచిత్రమో ఈ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నా ఒక్క ఎర్లీ షో కూడా వేయలేదు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో 2023లో మూడే సినిమాలు మొదటి రోజు సింగిల్ స్క్రీన్స్ లో 10 లక్షలు పైన వసూలు చేశాయి.

కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన క్రాంతి సినిమా ఐదు థియేటర్లలో పది లక్షలకు పైగా వసూలు చేయగా అజిత్ హీరోగా నటించిన తునివు… ప్రసన్న, బాలాజీ, శ్రీనివాస అనే మూడు థియేటర్లలో 10 లక్షల పైన వసూలు చేసింది. ఇక షారుఖ్ ఖాన్ పఠాన్ ఊర్వశి థియేటర్లో 10 లక్షలపైన వసూలు చేసింది.