మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే గుర్తింపుని తన కొత్త సినిమా టైటిల్‌లో వేయించుకున్నాడు జూనియర్ ఎన్టీయార్. కానీ, అతన్ని జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనేశాడు, ‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.
నిజానికి, విజయేంద్ర ప్రసాద్ మాటల వెనుక ఉద్దేశ్యం వేరు. సినిమాలో రామ్ చరణ్ పాత్రకి సపోర్టింగ్ పాత్ర జూనియర్ ఎన్టీయార్‌ది అని. సపోర్టింగ్ అంటే చిన్నమాట కాదు. కానీ, ఆ డిక్షన్ ఎక్కడో తేడా కొట్టేసింది.
టీడీపీ అనుకూల మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చే జరిగింది. కుల ప్రస్తావన కూడా వచ్చింది. ఇంతకీ, ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీయార్ ఏమనుకుంటున్నట్టు.? ఆయన కూడా గుస్సా అయ్యాడట. పీఆర్ టీమ్స్ అలర్ట్ అయ్యాయట.
వెరసి, మీడియాలో రచ్చ. రాజమౌళి తన తండ్రిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటూ వెబ్ మీడియా, ఉచిత సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిందంటే, ఇదంతా జూనియర్ ఎన్టీయార్ పీఆర్ టీమ్స్ చలవేనని సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు.
‘మా ఇంటి పిల్లాడే’ అని జూనియర్ ఎన్టీయార్ గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల్లో ఆంతర్యం ఏంటబ్బా.?