ఇండస్ట్రీ టాక్ : “దేవర” కోసం ఎన్టీఆర్ కి స్పెషల్ ట్రైనింగ్ అట 

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో భారీ హైప్ తో ఉన్న జస్ట్ కొన్నిటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో చిత్రం “దేవర”. మరి ఎన్టీఆర్ పోస్ట్ RRR సక్సెస్ టేకప్ చేసిన చిత్రం ఇది కావడంతో నెక్స్ట్ లెవెల్ అంచనాలు దీని చుట్టూతా నెలకొన్నాయి.

అయితే మొదట ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కి ఇచ్చినప్పటికీ ఈ చిత్రం నెక్స్ట్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఇక ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేయగా ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ మాస్ లోకి ఈ చిత్రం వెళ్ళింది. కాగా ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండగా.

లేటెస్ట్ గా అయితే ఎన్టీఆర్ ఓ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఈ ఇన్ఫో ప్రకారం అయితే ఇపుడు ఎన్టీఆర్ ఓ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడట. సినిమాలో ఇది కీలక సన్నివేశం కాగా ఈ సీన్ కోసం ఎన్టీఆర్ కి ట్రైనింగ్ ఇచ్చేందుకు ముంబై నుంచి స్కూబా డైవర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

వారి సారథ్యంలో ఎన్టీఆర్ అయ్యితే ఇప్పుడు ఈ కీలక సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. మొత్తానికి అయితే కొరటాల ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో సెట్ చేస్తున్నాడు అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.