టాలీవుడ్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు కాగా తనకి ఉన్న భారీ ఫాలోయింగ్ తో అయితే ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు దీనితో ఇప్పుడు తాను చేస్తున్న చిత్రం “దేవర” పై పాన్ వరల్డ్ లెవెల్లో మంచి క్రేజ్ ఉండగా ఈ చిత్రం షూటింగ్ లో తాను బిజీగా ఉన్నాడు.
అయితే నిన్ననే ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో తన తాత ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ లాంచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కావాలనే డుమ్మా కొట్టినట్టుగా రూమర్స్ రాగా ఇప్పుడు ఇది నిజం అని కన్ఫర్మ్ అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఉండడం వల్ల వెళ్లలేకపోయాడు అని ఓ వర్గం మీడియా మాట.
కానీ ఇంట్రెస్టింగ్ గా సినిమా దర్శకుడు ఏమో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసి తనకి నేషనల్ అవార్డు రావడంతో అభినందనలు తెలియజేయడానికి వెళ్ళాడు. మరి కొరటాల అల్లు అర్జున్ దగ్గర ఉంటే దేవర షూటింగ్ డైరెక్టర్ లేకుండా అందులోని ఎన్టీఆర్ సీన్స్ తీస్తారా?
ఎన్టీఆర్ కి వెళ్లడం ఇష్టం లేకే కనిపించలేదు అని ఇతరులు అంటున్నారు. దీనితో దేవర షూటింగ్ అనే సాకు మాత్రమే ఎన్టీఆర్ కావాలనే వెళ్ళలేదు అనేది సత్యం అని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ మాత్రం ఇలా బుక్కయిపోయాడు అని చెప్పక తప్పదు.