దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబం నుండి ఎటువంటి ప్రోత్సాహం లభించకపోయినా కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనంతట తాను ఒక్కో మెట్టు ఎదుగుతూ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదల చూసినా నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కి దగ్గర అయింది. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
అలాగే రాజకీయాలలో కూడా ప్రవేశించి టిడిపి పార్టీ తరపున పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఒప్పించే పనిలో ఉన్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతిసారి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట దాటి వేస్తున్నాడు. ఇదిలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య అయిన లక్ష్మీపార్వతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కి మద్దతుగా నిలవాలంటే చంద్రబాబు నాయుడు టిడిపి పగ్గాలను వదిలిపెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో టిడిపి పార్టీ తరపున జోరుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల గురించి అసలు ఆలోచించడం లేదు. అయితే ఎన్టీఆర్ టిడిపి కి మద్దతుగా నిలవాలంటే చంద్రబాబు నాయుడు టిడిపి పగ్గాలను తన కొడుకు లోకేష్ కి కాకుండా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెడితే ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాలలో కి వస్తారని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి టిడిపి పార్టీని తన గుప్పెట్లో పెట్టుకొని లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి అతనిని సీఎం చేయాలని చూస్తున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ బాధ్యతలు పూర్తిగా ఇచ్చేస్తారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. అంతేకాదు నేను కూడా టిడిపిలోకి వస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.