Ram Charan: సుక్కు సినిమాలో చరణ్ అలా కనిపించనున్నారా… నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే!

Ram Charan: మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ త్వరలోనే శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక నేడు రాజమహేంద్రవరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరగబోతుంది.

ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి . అదే విధంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి కలెక్షన్లను రాబడుతుంది అంటూ కూడా అభిమానులు చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇటీవల విడుదలైన పుష్ప2 సినిమాతో ఈయన భారీ కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించారు దీంతో తదుపరి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇదివరకే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.