బొద్దందాల అతిలోక సుంద‌రి ఏమిటో షాకిస్తోందిలా

సొంతం సినిమాతో టాలీవుడ్ కి పరిచ‌య‌మైంది న‌మిత‌. ఆర్య‌న్ రాజేష్ స‌ర‌స‌న‌ ఆరంగేట్రం ఎంతో క్యూట్ గా ల‌వ్ లీగా క‌నిపించింది. ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న జెమిని అనే రీమేక్ సినిమాలోనూ ఆడిపాడింది. అప్ప‌టివ‌ర‌కూ ఎంతో క్యూట్ గా ముద్దుగా అనిపించిన న‌మిత ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా రూపం మార్చేసుకోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌భాస్ బిల్లా సినిమాలో బికినీలో మ‌తి చెడ‌గొట్టిన‌ప్ప‌టికే నమిత బొద్దుగుమ్మ‌గా మారిపోయింది.

jhanvi kapoor new look due to lockdown
jhanvi kapoor new look due to lockdown

ఆ త‌ర్వాత న‌ట‌సింహా స‌ర‌స‌న సింహా చిత్రంలో న‌టించేప్ప‌టికి మ‌రింత బొద్దుగా మారింది. ఇదంతా కాలంతో పాటే వ‌చ్చే మార్పు. ఇప్పుడు ఇదే కోవ‌లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి వార‌సురాలు కూడా ఉన్న‌ట్టుండి బొద్దుగా కొత్త అవ‌తారంలోకి షిఫ్ట‌వుతుండ‌డం ఫ్యాన్స్ లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. చూస్తుండ‌గానే ఈ స్టార్ కిడ్ బొద్దెక్కిపోతోంది. అందుకు కార‌ణం ఏదైనా కానీ.. అప్పుడే జాన్వీ లుక్ లో ఏదో ఛేంజ్ క‌నిపిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బ‌హుశా ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ లో జిమ్ త‌గ్గించిందా? ఏమో కానీ.. ఇదిగో ఇలా రెడ్ హాట్ లుక్ లో ఒక్క‌సారిగా బొద్దందంతో క‌వ్విస్తూ జాన్వీ హాట్ టాపిక్ గా మారింది. న‌టించింది రెండు మూడు సినిమాలే. ధ‌డ‌క్ త‌ర్వాత కార్గిల్ గార్ల్ (గుంజ‌న్ స‌క్సేనా) సినిమా ఓటీటీలో రిలీజ‌య్యింది. త‌దుప‌రి త‌ఖ్త్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌నుంది. దోస్తానా సీక్వెల్ స‌హా ప‌లు క్రేజీ చిత్రాల్లోనూ జాన్వీ న‌టించ‌నుంది. అయితే అదుపు లేకుండా ఆకారం డ‌బుల్ అయితే మాత్రం అవ‌కాశాలు క‌ష్ట‌మే. ఇలా అయితే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రంలోనూ ఛాన్స్ ద‌క్క‌డం క‌ష్ట‌మే సుమీ! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఈ రెడ్ హాట్ లుక్ క‌వ్విస్తున్నా మునుముందు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మేనంటూ ఓ సెక్ష‌న్ నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు మ‌రి.