హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా.. ఆసుపత్రిలో చేరిక

Jeevitha rajashekar family gets corona positive

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు, నా భార్య జీవిత, పిల్లలు శివానీ, శివాత్మికకు కరోనా సోకింది. ఇది నిజమే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. పిల్లలు కోలుకున్నారు. నేను, జీవిత ఇంకా చికిత్స తీసుకుంటున్నాం. మా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. త్వరలోనే ఇంటికి వెళ్తామని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

Jeevitha rajashekar family gets corona positive
Jeevitha rajashekar family gets corona positive

రాజశేఖర్ పెద్ద కూతురు శివనీ కూడా నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దొరసాని సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషించింది. ప్రస్తుతం హిందీ సినిమా 2 స్టేట్స్ రిమేక్ లో ఆమె నటిస్తోంది. శివాత్మిక కూడా ఓ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది.

ఇక.. రాజశేఖర్ ప్రస్తుతం అర్జున్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. కన్మణి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.