Jeevitha Counter to Roja: రోజాకు అదిరిపోయే షాక్ ఇచ్చిన జీవిత… ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిన రోజా!

Jeevitha Counter to Roja: సినీ నటి రోజా గురించి చెప్పాలంటే ఆమెకు ఎమ్మెల్యేగా కంటే ఎక్కువగా జబర్దస్త్‌ ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కమెడియన్స్‌ చేసిన స్కిట్స్‌కు జడ్జిమెంట్ ఇస్తూనే, మధ్య మధ్యలో వారి కంటే ముందే పంచ్‌లను వేస్తూ వీక్షకులను కట్టిపడేస్తున్నారు.

పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుల్లితెరపైనా తన హవా కొనసాగిస్తూ , ట్రెండ్‌కు తగ్గట్టు పంచ్‌లు వేస్తూ తెలుగు అభిమానులను అలరిస్తున్నారు రోజా. గత తొమ్మిదేళ్ల నుంచి జబర్దస్త్‌ షోకు ఎంతో మంది టీం లీడర్లు వస్తున్నారు… వెళుతున్నారు.. జడ్జీలు కూడా మారారు. కానీ ఆమె మాత్రం తన స్థానానికి ఫిక్స్ అయిపోయి, వినోదాన్ని పంచుతున్నారు.

ఇకపోతే తాజాగా విడుదలైన జబర్దస్త్‌ ప్రోమో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నటి రోజా, మరొక హీరోయిన్ జీవిత కలిసి ఓ స్కిట్ చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరిలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు గ్రేట్ అనే విషయానికొస్తే… కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇద్దరూ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్సే. ఇద్దరూ కూడా ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చాలు ముందూ, వెనకా చూడకుండా వాయించేస్తుంటారు. అలాంటి వారిద్దరూ కలిసి ఒకే స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక వివరాల్లోకి వెళితే, వారిద్దరూ కలిసిన స్పెషల్ స్కిట్‌లో భాగంగా రోజాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు జీవిత. నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అని రోజా అంటే, ఏ యాంగిల్‌లో అమ్మా అంటూ జీవిత ఇచ్చిన కౌంటర్‌కు రోజా షాక్ అయ్యి , ఏం మాట్లాడకుండా ఉంటారు. ఆ సన్నివేశాన్ని చూసిన కంటెస్టంట్స్ అంతా నవ్వడం ఇప్పుడు వైరల్ మారింది. ఎప్పుడూ పంచ్‌లు ఇవ్వడమే గానీ, ఇలా తాను కూడా పంచ్‌లకు బలి కావడం చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉగాది ఈవెంట్‌లో భాగంగా వీరిద్దరూ చేసిన ఈ కామెడీ స్కిట్ ఈ షోకి ప్రస్తుతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.