1000 కోట్లకి దగ్గరలో “జవాన్”.. నయా కలెక్షన్ డీటెయిల్స్.!

బాలీవుడ్ షేర్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొడితే.. హిట్ కూడా కాదు ఇది జస్ట్ ఎబోవ్ యావరేజ్ కొడితేనే బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా గ్రాస్ వచ్చి పడుతుంది. ఈ ఏడాది షారుఖ్ నుంచి వచ్చిన పఠాన్ సినిమా జస్ట్ యావరేజ్ కంటెంట్ తోనే వచ్చింది. అయినా రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.

ఈ తర్వాత తమిళ దర్శకుణ్ణి బాలీవుడ్ లో పరిచయం చేసి చేసిన సినిమానే “జవాన్”. కాగా ఈ భారీ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇదీ యావరేజ్ కంటెంట్ తోనే వచ్చింది కానీ షారుఖ్ మాస్ ప్రెజెన్స్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టి 1000 కోట్ల దిశగా తీసుకెలుతుంది.

కాగా ఇన్ని రోజులు సెన్సేషనల్ వసూళ్లు కంటిన్యూ చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా 950 కోట్ల మార్కుని దాటేసి రికార్డు వసూళ్లు 1000 కోట్ల గ్రాస్ కి వెళ్తుంది. దీనితో వరుసగా రెండు 1000 కోట్ల గ్రాస్ ఉన్న ఇండియన్ హీరోగా షారుఖ్ ఇప్పుడు నిలవబోతున్నాడు.

మొత్తం ఇప్పటివరకు ఈ చిత్రం 954 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా అందుకోగా బాలీవుడ్ లో తన పఠాన్ రికార్డులు తానే బ్రేక్ చేసుకునే దిశగా ఇపుడు షారుఖ్ వెళ్తున్నాడు. అంతే కాకుండా ఇక ఇది కూడా వీకెండ్ కాబట్టి సుమారుగా 1000 కోట్ల దగ్గరకి వసూళ్లు వచ్చినా వాటిని క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఇలా జవాన్ హవా వరల్డ్ వైడ్ గా అయితే నడుస్తుంది. 
https://x.com/RedChilliesEnt/status/1705514703714447370?s=20