బాక్సాఫీస్ డే 3 : నెవర్ బిఫోర్ ఇండియా రికార్డ్ తో “జవాన్” విధ్వంసం

పాన్ ఇండియా బాద్షా హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “జవాన్” భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి సెన్సేషనల్ సక్సెస్ ని చూసి అదరగొట్టింది. దీనితో ఈ సినిమా మొదటి రోజు నుంచే నెవర్ బిఫోర్ నంబర్స్ ని సెట్ చేస్తుండగా ఇప్పుడు మూడు రోజుల రన్ ని అయితే ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది.

కాగా ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో అలాగే మూడవ రోజు కూడా ఇండియన్ బాక్సాఫీస్ చూడని సరికొత్త నంబర్స్ ని సెట్ చేసింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కాగా జవాన్ మూడవ రోజు అయితే ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని వసూళ్లు అందుకుంది.

జస్ట్ మూడో రోజు ఏకంగా 144 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా హిందీ బెల్ట్ లో అయితే 68.72 కోట్లని అందుకుంది. దీనితో మూడో రోజు వసూళ్లతో మొత్తం మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏకంగా 384 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. దీనితో ఈ సెన్సేషనల్ నెంబర్ అందుకున్న రేర్ చిత్రాల్లో ఒకటిగా జవాన్ ఇప్పుడు నిలిచింది.

మొత్తానికి అయితే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ హవా మాములు రేంజ్ లో నడవట్లేదు అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. అలాగే నయనతార హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, దీపికా పదుకొనె లు గెస్ట్ పాత్రల్లో కనిపించారు. అలాగే అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.