బిగ్ అప్డేట్ : భారీ నిర్మాణ సంస్థతో “జవాన్” ఇంటర్నేషనల్ రిలీజ్!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర మాసివ్ హిట్ కొట్టిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం “పఠాన్” అని చెప్పాలి. ఈ ఏడాదికి మొదటి 1000 కోట్ల సినిమా ఇదే కాగా ఇంకా దీనిని ఏది కూడా బీట్ చెయ్యలేదు.

అయితే ఈ చిత్రం హిట్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్నా మరో పాన్ ఇండియా సినిమానే “జవాన్”. అయితే ఈ సినిమాతో హిందీ సహా సౌత్ మార్కెట్ పై కూడా మరింత పట్టు సాధించాలని దర్శకుడు అట్లీ తో సినిమా చేయగా దీనిపై భారీ హైప్ కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ప్రీ వ్యూ టీజర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కూడా పఠాన్ సరసన మరో 1000 కోట్ల సినిమాగా నిలుస్తుంది అని ట్రేడ్ చెప్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు జవాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ భాద్యతలు భారీ నిర్మాణ సంస్థ అయినటువంటి యష్ చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.

అలాగే వీరే షారుఖ్ లాస్ట్ చిత్రం పఠాన్ ని నిర్మాణం వహించారు. ఇప్పుడు జవాన్ ఓవర్సీస్ రిలీజ్ ని అయితే వీరు చేయబోతున్నారు. మరి దీనితో అయితే మళ్ళీ పఠాన్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ నుంచి భారీ వసూళ్లు అందుకుంటారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నయనతార, దీపికా పదుకొనె అలాగే విజయ్ సేతుపతి లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించగా ఈ సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ కాబోతుంది.