హిస్టారికల్ జవాన్..9 రోజుల్లో రికార్డు వసూళ్లు.!

బాలీవుడ్ సినిమా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న పూర్వ వైభవాన్ని అయితే ఎట్టకేలకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మళ్ళీ అందించిన బాలీవుడ్ కి నిజమైన కింగ్ అని అనిపించుకున్నాడు. కాగా తాను జస్ట్ యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసినా కూడా వాటికి ఊహించని లెవెల్ వసూళ్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి.

సౌత్ లో కూడా మన స్టార్ హీరోస్ సినిమాల్లా కానీ వసూళ్లు వస్తే మాత్రం ఇండియన్ సినిమా దగ్గర షారుఖ్ ని కొట్టేవారే ఉండరు. ఆ రేంజ్ స్టామినా షారుఖ్ ది. మెయిన్ గా ఓవర్సీస్ మార్కెట్ నుంచే సునాయాసంగా 400 నుంచి 500 కోట్లు కొల్లగొడుతున్న షారుఖ్ ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా “జవాన్” తో వండర్స్ చేస్తున్నాడు.

మరి గత వారం రిలీజ్ అయ్యిన ఈ భారీ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ లో నమోదు చేస్తుంది. ఇక ఇప్పటికి మొత్తం 9 రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా మొత్తం 9 రోజుల్లో ఏకంగా 735 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది.

దీనితో షారుక్ కెరీర్ లో ఈ సినిమా మరో బిగ్గెస్ట్ గ్రాసింగ్ సినిమాగా దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇప్పటికే పఠాన్ 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరగా దానికన్నా ఫాస్ట్ గా ఈ సినిమా చేరిపోయేలా ఉందని చెప్పడంలో ఇప్పుడు సందేహం అక్కర్లేదు. అసలే ఈ వారంలో కూడా మేజర్ రిలీజ్ లు లేవు కాబట్టి జవాన్ దే హవా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించగా నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించాడు.