“జవాన్” బాక్సాఫీస్..మొదటి రోజే హిస్టరీ… 

గత కొన్నాళ్ల నుంచి నెలకొన్న సంక్షోభం వేరు అలానే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ మార్కెట్ లో నెలకొన్న సంక్షోభం వేరు. దీనితో కరోనా తర్వాత కూడా బాలీవుడ్ తేరుకోడానికి చాలా సమయం తీసుకుంది. మరి ఇక్కడ నుంచి ఒకో సినిమా వస్తున్నాయి అయితే డిజాస్టర్ లేదా చాలా తక్కువ వసూళ్లు మాత్రమే వస్తున్నాయి.

దీనితో బాలీవుడ్ లో సరైన హిట్ కావాల్సి ఉంది. మరి ఆ సమయంలో వచ్చిన సినిమానే “పఠాన్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో షారుఖ్ ఖాన్ చేసిన మొదటి సినిమా ఇది కాగా దీనితో షారుఖ్ ఖాన్ గట్టి కం బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అయితే ఆ సినిమానే ఒక రికార్డు మేకర్ అనుకుంటే ఇప్పుడు దీనిని తన కొత్త సినిమా “జవాన్” తో షారుఖ్ లేపేసాడు.

నిన్న సెప్టెంబర్ 7న ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం క్రేజీ నడుమ వచ్చి హిందీలో ఇపుడు ఏకంగా 66 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. దీనితో హిందీలో ఇప్పుడు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా భారీ రికార్డును ఈ చిత్రం నమోదు చేయగా వరల్డ్ వైడ్ గా అయితే ఈ చిత్రం ఏకంగా 129.6 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. .

అంతే కాకుండా ఈ చిత్రం అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ హిందీ సినిమాకి కూడా రాని రికార్డు ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే ఓ రికార్డు బ్రేకింగ్ సినిమాతో షారుఖ్ మళ్ళీ వచ్చాడని చెప్పాలి.