బాక్సాఫీస్ : మరో ఫాస్టెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసిన “జవాన్” వసూళ్లు 

ఒక స్టార్ హీరోకి సరైన హిట్ పడితే దానిని ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఆ చిత్రం దానంత ఆగడం తప్ప ఎంత నెగిటివ్ చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది. ఇక ఈ లిస్ట్ కి సరిగ్గా లేటెస్ట్ బాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “జవాన్” కూడా సరిపోతుంది.

బాలీవుడ్ కింగ్ ఖాన్ అయినటువంటి షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించగా షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో అయితే అప్పటికే పఠాన్ అనే సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన తాను నెక్స్ట్ ఈ సినిమాతో రావడంతో భారీ హైప్ నెలకొంది.

కాగా ఈ హైప్ కి తగ్గట్టే ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యాక బాలీవుడ్ సినిమా చూడని నెవర్ బిఫోర్ రికార్డులు అయితే తాను సెట్ చేసాడు. మరి ఈ భారీ చిత్రం ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డు ఫీట్ ని ఇండియన్ సినిమా దగ్గర అందుకున్నట్టుగా తెలుస్తుంది.

బాలీవుడ్ నుంచి హిందీ వెర్షన్ సహా ఇతర భాషల హిందీ వెర్షన్ సినిమాలు కూడా రిలీజ్ కాగా వాటి అన్నిటిలో కూడా ఫాస్టెస్ట్ 300 కోట్ల గ్రాసర్ సినిమాగా ఇప్పుడు జవాన్ నిలిచింది. ఈ సినిమా ఈ మార్క్ ని అందుకోడానికి ఇండియా లో కేవలం అంటే కేవలం 6 రోజుల సమయాన్నే తీసుకుంది.

దీనికి ముందు షారుఖ్ నటించిన పఠాన్ 7 రోజులతో రెండో స్థానంలో ఉంది. దీనితో మొత్తానికి అయితే ఈ సినిమా రోజుకో రికార్డు కొల్లగొట్టి షారుఖ్ పేరిట లిఖిస్తుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాకి సోమవారం అయితే 30 కోట్ల మేర గ్రాస్ రాగ ఇది కాస్త తక్కువే అని తెలుస్తుంది. మన టాలీవుడ్ హిట్ బాహుబలి 2 నే హిందీ వెర్షన్ లో ఏకంగా 40 కోట్లకి పైగా గ్రాస్ ని మొదటి సోమవారం రిజిస్టర్ చేసింది. మరి జవాన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.