రెండు రోజుల కిందట రిలీజైన జైలర్ సినిమాతో రజనీ మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే రేంజ్‌లో సూపర్ స్టార్ జైలర్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్ మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. పైగా శుక్రవారం విడుదలైన భోళా అటు ఇటుగా రివ్యూలు తెచ్చుకోవడంతో ఈ సినిమాకు తెలుగులో సాలిడ్ రేంజ్‌లో కలెక్షన్‌లు వస్తున్నాయి.
తొలిరోజే దాదాపు ఇక్కడ రూ.15 కోట్లు కొల్లగొట్టి చాలా రోజల తర్వాత టాలీవుడ్‌లో తన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో నిరూపించాడు. ఇక ఈ సినిమాలో రజనీకు సమానంగా ఎలివేట్ అయిన మరో రెండు పాత్రలు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్. పేరుకు గెస్ట్ అప్పియరెన్సే అయినా.. వీళ్ల చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. వీళ్ల ఎంట్రీకి ఈలలు గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. కాగా అలాంటి ఓ పవర్ ఫుల్ రోల్ కోసం నెల్సన్, బాలయ్యను అనుకున్నాడట. కానీ కథానుగుణంగా ఆ క్యారెక్టర్‌ను సరిగ్గా డిజైన్ చేయలేకపోవడంతో ఆయన్ను సంప్రదించలేక పోయానని నెల్సన్ స్వయంగా చెప్పాడు.
అంతేకాకుండా భవిష్యత్తులో బాలయ్యతో సినిమా కూడా చేస్తానేమో అంటూ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీ రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించాడు. ఓ వైపు పదేళ్లుగా సాలిడ్ హిట్టు లేని రజనీకి, మరో వైపు బీస్ట్‌తో భారీ ప్లాప్ మూటగట్టుకున్న నెల్సన్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ అయింది.జైలర్ తొలిరోజే దాదాపు రూ.90 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఇక రెండో రోజు రూ.60 కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్‌లోకి అడుగపెట్టి ఔరా అనిపించింది.
తెలుగులోనూ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. రెండు రోజుల్లోనే పాతిక కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు సాధించి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇక శని, ఆది వారాలతో ఈ సినిమా డిస్టిబ్యూట్రర్‌లకు కళ్లు చెదిరే లాభాలు ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.