జైలర్ బాక్సాఫీస్.. ఇక వచ్చేవన్నీ లాభాలే!

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయేలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తానికి దాదాపు అని ఏరియాలలో కూడా బ్రేకింగ్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది ప్రస్తుతం మంచి ప్రాఫిట్ తో ముందుకు సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కలెక్షన్స్ కూడా పెంచుకుంటుంది. శనివారం రోజు 4 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా 5వ రోజు అంతకంటే ఎక్కువగా 5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 4 రోజుల్లో ఈ సినిమా 18.93 కోట్ల షేర్ కలెక్షన్స్ 33.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తెలుగులో చేసిన బిజినెస్ 12 కోట్లు మాత్రమే ఇక ఆ టార్గెట్ ఫినిష్ కాకుండా ఇప్పుడు బయ్యర్లకు ఐదు కోట్లకు పైగా ప్రాఫిట్ అందిస్తోంది. ఇక రేపు కూడా ఈ సినిమాకు మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా 4 రోజుల్లో 300 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. టోటల్ గా ఈ సినిమా బిజినెస్ 122 కోట్ల రేంజ్ లోనే జరిగింది. ఇక 148 కోట్ల షేర్ కలెక్షన్స్ రావడంతో ప్రస్తుతం 24 కోట్ల రేంజ్ లో అయితే ఈ సినిమా ప్రాఫిట్ లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ నెంబర్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత జైలర్ సినిమాతో రజనీకాంత్ పూర్తిస్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.