అర్ధనగ్నంగా శ్రీలంక భామ.. ఆ ఆనందంలో అలా చేసేసిన హీరోయిన్!!

సోషల్ మీడియాలో కొందరు భామలు వింత పోకడలకు తెరలేపుతుంటారు. వింత వింత ఫోటో షూట్లు చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. మన తెలుగులో నటించే హీరోయిన్లు కొద్ది మేర హద్దుల్లోనే ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో చిచ్చు పెడుతుంటారు. తాజాగా శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో అర్దనగ్న ఫోటోలోను పెట్టి రచ్చ చేస్తోంది. దానికి కూడా ఓ కారణం ఉందట.

Jacqueline Fernandez Latest Pics Goes Viral
Jacqueline Fernandez Latest Pics Goes Viral

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కిక్ సినిమాతో బాగానే ఫేమస్ అయింది. జుమ్మే కే రాత్ హై అంటూ అదిరిపోయే స్టెప్పులను వేసి అందర్నీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కు అతి సన్నిహతంగానే ఉంటుంది. ఆ మధ్య లాక్ డౌన్‌లోనూ సల్మాన్ ఖాన్ తన ఫాంహౌస్‌లో చిక్కుకుపోయాడు. సల్మాన్‌తో పాటు జాక్వెలిన్ కూడా అక్కడే ఐదారు నెలలు ఉండిపోయింది. మధ్యలో ఖాళీగా ఉండటమెందుకని అక్కడే ఓ ప్రైవేట్ ఆల్బమ్‌ను కూడా రూపొందించారు. అది కూడా బాగానే వైరల్ అయింది.

Jacqueline Fernandez Latest Pics Goes Viral
Jacqueline Fernandez Latest Pics Goes Viral

ఇక తాజాగా ఈ శ్రీలంక భామకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మైల్ స్టోన్‌కు చేరుకుంది. ఇన్ స్టాగ్రాంలో 46 మిలియన్ల ఫాలోవర్లు రావడం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ రేంజ్‌లో ప్రేమ కురిపిస్తున్నందుకు నెటిజన్లకు ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కానీ అందాలను తెలివిగా దాచేసింది. పూలతో తన ఎద అందాలను దాచి పెట్టేసి ఫాలోవర్లలో కాక రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.