Jabardasth Varsha : జబర్ధస్త్ లో లేడి డామినేషన్.. జడ్జ్స్ దెబ్బకు వెనక్కి తగ్గిన ఇమాన్యుయేల్..!

Jabardasth Varsha : బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. అటువంటి వారిలో ఇమాన్యుల్ కూడా ఒకరు. వర్షతో కలిసి స్కిట్లు చేయటం వల్ల ఈ జోడీ బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ ఇలా స్పెషల్ ఈవెంట్ లు స్కిట్ లు కలిసి చేయడంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే అది కేవలం కీర్తి కోసం మాత్రమేనని తేలిపోయింది. అయితే ఇటీవల వీరిద్దరు బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేరారు.

బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఉన్న ఫైమ జబర్దస్త్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇమాన్యుల్, వర్ష కూడా భాస్కర్ టీం లో స్కిట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల వీరు నలుగురు కలిసి చేసిన స్కిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ స్కిట్ లో భాగంగా ఇమాన్యుల్ వర్షను కొట్టబోతే జడ్జ్ అడ్డుపడి ఇమాన్యుల్ కి వార్నింగ్ ఇస్తారు. దీంతో ఇమాన్యుల్ మాట్లాడుతూ ఇక్కడ అంతా లేడీ డామినేషన్ ఉంది. వెంటనే మనో గారిని తీసుకురండి అని అనటంతో అందరు ఒక్కసారిగ నవ్వుతారు.

ఇటీవల రోజా గారికి మంత్రి పదవి తగ్గటంతో జబర్దస్త్ నుండి వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో సింగర్ మనో కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందువల్ల పూర్ణ, ఇంద్రజ గారు జబర్థస్త్ కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బుల్లెట్ భాస్కర్ టీమ్ వేసిన స్కిట్ లో ఇమాన్యుల్ వర్ష మీద అరుస్తాడు. దీంతో ఇంద్రజ అడ్డుపడి వర్షను ఏమైనా అంటే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా లేడీ గెటప్, మగాడు అని వర్షని అనకూడదు అని ఇమాన్యుల్ కి వార్నింగ్ ఇస్తుంది. దీంతో భాస్కర్ మాట్లాడుతు ఇక్కడ అందరూ లేడి డామినేషన్ ఎక్కువ ఉంది కొంచం చూసుకోర అని అంటాడు. అప్పుడు ఇమాన్యుల్ మాట్లాడుతు అందుకేగా కొట్టకుండా ఊరికే కొట్టినట్టు వార్నింగ్ ఇస్తున్నా అని అంటాడు.