ఓంకార్ ని ఏకీపారేస్తున్న జబర్దస్త్ అభిమానులు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓంకార్ గురించి తెలియని వారంటూ ఉండరు. దర్శకుడిగా నిర్మాతగా, వ్యాఖ్యతగా ఓంకార్ ఇటు బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అటు వెండి తెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. బుల్లితెరకు ఓంకార్ కమర్షియల్ హంగులు అద్దాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆట డాన్స్ షో ద్వారా మంచి విజయం అందుకున్న ఓంకార్ ఆ తర్వాత ఎన్నో టీవి షోస్ ద్వారా ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మా ప్రసారమవుతున్న టీవి షోస్ అన్ని ఓంకార్ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీవి షోస్ అన్ని ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షో లకు దీటుగా ఉండేలా పక్క ప్లాన్ చేస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా ఓంకార్ బుల్లితెర ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ అభిమానులు ఓంకార్ ని బండ బూతులు తిడుతున్నారు. అందుకు కారణం అధిక రెమ్యునరేషన్ ఆశ చూపించి జబర్దస్త్ లో ఫేమస్ అయిన కమెడియన్స్ అందరిని ఓంకార్ తనవైపు లాగేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ విషయంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుధీర్ జబర్దస్త్ విడిచి మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో సందడి చేయటానికి కారణం ఓంకార్. సుధీర్ కి అధిక రెమ్యూనరేషన్ ఆశ చూపించి ఓంకార్ తనవైపు తిప్పుకున్నాడు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ కూడా అధిక రెమ్యూనరేషన్ కి ఆశపడి జబర్దస్త్ కి దూరమైంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారందరిని ఓంకార్ తన వైపు తిప్పుకొని జబర్దస్త్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఒకప్పుడు బుల్లితెరలోనే టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన జబర్దస్త్ ఇప్పుడు తక్కువ రేటింగ్స్ నమోదు కావటానికి కారణం ఓంకార్. ఓంకార్ లాభనష్టాలు చూసుకోకుండా జబర్దస్త్ ని దెబ్బతీయటమే పనిగా జబర్థస్త్ కమెడియన్లని తన వైపు తిప్పుకున్నాడు. దీంతో జబర్థస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అలా అని మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి ఎక్కువ రేటింగ్స్ కూడా రావటం లేదు. భవిష్యత్తులో జబర్దస్త్ రేటింగ్స్ పడిపోయి ఆ షో నిలిపివేసే స్థాయికి వచ్చే అవకాశం ఉంది. దీంతో కామెడీ స్టార్స్ షో తో స్టార్ మా ఛానల్ అత్యధిక రేటింగ్స్ పొందుతుందనీ ఓంకార్ ప్లాన్. మొత్తానికి జబర్థస్త్ పరిస్థితి దారుణంగా మారటానికి మాత్రం ఓంకార్ కారణం. అందువల్ల జబర్థస్త్ అభిమానులు ఓంకార్ ని ఏకిపారేస్తున్నారు.