ప్రవీణ్ నంబర్ బ్లాక్ చేసిన ఫైమా.. అందరి ముందు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన ప్రవీణ్..!

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఈ మధ్యకాలంలో లేడీ కంటెస్టెంట్లు కూడా జబర్దస్త్ లో బాగా సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన లేడీ కంటెస్టెంట్స్ లో ఫైమా కూడా ఒకరు. మొదట పటాస్ షోలో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు పొందిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సందడి చేసింది. బుల్లెట్ భాస్కర్ టీం లో ఎన్నో స్కిట్లూ చేసిన ఫైమా తన బాడీ లాంగ్వేజ్, కామెడీ పంచలతో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం పైన శ్రీదేవి డ్రామా కంపెనీ సోలో కూడా సందడి చేస్తోంది. జబర్దస్త్ లో ఫైమా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతోమంది లేడీ కంటెస్టెంట్లు జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పటాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ప్రవీణ్ తో పైమా ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పటాస్ షో ద్వారా వీరిద్దరూ ఒకేసారి తమ కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు స్వయంగా వారే అంగీకరించారు. 2019లో ప్రవీణ్ ప్రపోజ్ చేసినట్టు ఫైమా వెల్లడించింది. అయితే ఇద్దరి మధ్య ఓ సారి గొడవ జరిగినప్పుడు ఫైమా ప్రవీణ్ నెంబర్ బ్లాక్ చేసిందట. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షో లలో ఫైమా, ప్రవీణ్ ల పర్‌ఫార్మెన్స్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమోలో ఈ జంట లవ్ ప్రపోజల్ హైలైట్ గా నిలిచింది.

ఈవారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో బుల్లితెర నటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు జంటగా మంచి రొమాంటిక్ పాటకు డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో పైమా ప్రవీణ్ కూడా ఈ పాటకు పర్ఫార్మ్ చేశారు. ఇలా వారిద్దరూ ఒకరి మొహం ఒకరు చూస్తూ ఉండగా మధ్యలో ఆది ఎంట్రీ అలానే చూస్తూ ఉండిపోతారా అని అంటాడు. తర్వాత ప్రవీణ్ అందరి ముందు ఫైమా కి ప్రపోజ్ చేస్తూ ఆమె వేళ్ళకి ఉంగరం తొడిగాడు. ఈ క్రమంలో ప్రవీణ్ పైమా గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తల్లికిచ్చిన మాట నేర్పించడం కోసం పైమా చాలా కష్టపడి సొంత ఇంటి కల నెరవేర్చిందని చెప్పుకొచ్చాడు. తర్వాత ఫైమా మీ అమ్మకి చెప్పు అల్లుడు వస్తున్నాడని అనగా.. ఫైమా సిగ్గుపడుతూ ఉండిపోయింది.