ఈ కర్రోడు ఎందుకు.. జబర్దస్త్ అప్పారావును ఓ ఆటాడుకున్న భార్య!!

Jabardasth Apparao WIfe Satires In Suma Cash Show

జబర్దస్త్ స్టేజ్ మీద ఎదిగిన వారిలో అప్పారావు ఒకరు. జబర్దస్త్ కంటే ముందే ఎన్నే యేళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నాడు. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ ఏనాడూ అంతగా గుర్తింపు రాలేదు. అదో ఒక్కసారిగా జబర్దస్త్ స్టేజ్ మీద కనబడటంతో, అక్కడ ఆర్టిస్ట్ నుంచి టీం లీడర్‌గా ఎదగడం ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ రావడంతో అప్పారావ్ అంటే తెలియని వారెవ్వరూ లేరు. ఇక అప్పారావుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ కూడా అందరికీ సుపరిచితురాలే.

జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో స్కిట్స్ చేసింది. ఆమె స్టేజ్ ఎక్కితే పంచ్‌ల ప్రవాహానికి ఎవ్వరైనా సరే కొట్టుకుపోవాల్సిందే. ఈ ఇద్దరి బుల్లితెరపై మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. అందం కాదు ఆప్యాయతలుంటే ఆనందంగా బతకొచ్చని నిరూపించారు. ఇస్మార్ట్ జోడిలోనూ ఈ ఇద్దరూ తమ ప్రతిభను ప్రదర్శించారు. చివరి వరకు వచ్చారు కానీ విన్నర్‌గా నిలవలేకపోయారు. అయినా సరే గెలిస్తే తాము ఇంతవరకు హనీమూన్‌కు వెళ్లలేదని, వచ్చిన డబ్బులతో వెళ్తామని అనుకున్నారు. గెలవకపోయినా సరే ఓంకార్ ఈ మేరకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సొంత డబ్బులో మిమ్మల్ని హనీ మూన్ పంపిస్తానని అప్పారావుకు మాటిచ్చాడు.

Jabardasth Apparao WIfe Satires In Suma Cash Show
Jabardasth Apparao WIfe Satires In Suma Cash Show

తాజాగా అప్పారావ్, లక్ష్మీ సుమ క్యాష్ షోలో సందడి చేశారు. లక్ష్మీ వేసిన పంచ్‌లకు అప్పారావు పరువుపోయినట్టైంది. ముద్దు పెట్టాలంటూ సుమ ఇచ్చిన టాస్క్‌లో మొహం కడుక్కున్నావా?.. ఏ హీరోనో ఉండుంటే బాగా పెట్టేదాన్ని అని అనడంతో అందరూ నవ్వేశారు. ఓ అమ్మాయి అప్పారావ్ లాంటి భర్త కావాలని కోరుకుంది. ఎందుకమ్మ ఈ కర్రోడు.. నీకు మహేష్ బాబు లాంటి మంచి అబ్బాయి వస్తాడు అంటూ అప్పారావ్ గాలి తీసేసింది.

Cash Latest Promo - 31st October 2020 - Prasad, Dora Babu, Nagi, Apparao - Mallemalatv