బొమ్మ బ్లాక్ బస్టరే ఇక.. పోతురాజు లవర్ వాణిగా రష్మీ.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

jabardasth anchor rashmi new film bomma block buster

బజర్దస్త్ యాంకర్ రష్మీ ఎంత పాపులరో అందరికీ తెలుసు. తను కూడా ఈవెంట్లతో ఫుల్లు బిజీ. స్క్రిప్ట్ నచ్చితే అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసిన రష్మీ.. తాజాగా మరో సినిమాలో నటిస్తోంది.

jabardasth anchor rashmi new film bomma block buster
jabardasth anchor rashmi new film bomma block buster

బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో రష్మీ నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రష్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నది.

ఈ సినిమాలో గీతామాధురి భర్త నంధు కీలక పాత్రలో నటించనున్నాడు. ఇందులో నందు పేరు పోతురాజు అని.. పోతురాజు గాడి లవర్ వాణిగా రష్మీ.. అంటూ ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు.

పోతురాజుగానే కాకుండా.. నందు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ గా కనిపిస్తాడట. ఇక.. ఫస్ట్ లుక్ లో రష్మీ కిరీటం పెట్టుకొని చిరునవ్వులు చిందిస్తుంది. ఈ లుక్ లో ఉన్న రష్మీని చూసి.. వావ్.. ఎంత అందంగా ఉంది రష్మీ అంటూ రష్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక.. ఈ సినిమాను విజయీభవ ఆర్ట్స్ పై ప్రవీణ్, బోసు బాబు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మరోవైపు నందు ఇటీవలే సవారీ సినిమాలో నటించాడు. ఆ సినిమా తర్వాత మరే సినిమా రాలేదు. నందు బిగ్ బాస్ కి సెలక్ట్ అయ్యాడంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. తర్వాత తాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్తున్నట్టు నందు కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన అభిమానులకు చెప్పాడు. అయితే.. హౌస్ లోకి వెళ్లకముందే నందు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అని చెప్పడంతో అతడిని రూల్స్ బ్రేక్ చేసినందుకు షోనుంచి తప్పించినట్టు సమాచారం.